నిన్న ప్రపంచమంతా విస్తృతపోయే విధంగా శ్రీలంక రాజధాని కొలంబో లో వరుసగా భారీ బాంబు పేళుళ్లు జరిగాయి. ఉదయం ఆరు చోట్ల పేలుళ్లు జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. అంతలోనే మధ్యాహ్నానికి మరో రెండు పేలుళ్లు చోటుచేసుకోవడంతో అసలేం జరుగుతోందో అర్థంకాక శ్రీలంక ప్రజలు హడలిపోతున్నారు.ఈ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 200కి చేరినట్టు సమాచారం.
క్షతగాత్రుల సంఖ్య 450 వరకు ఉంది. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి నటి రాధికా శరత్ కుమార్ ప్రాణాతో బయటపడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
అయితే ఈ ప్రమాదం జరిగే సమయానికి నటి రాధిక అక్కడనే ఉన్నారు. కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్ ఆమె బస చేశారు. ఘటన జరిగే కొద్దిసేపటి ముందు ఆమె ఈ హోటల్‌ను ఖాళీ చేశారు. దీనితో రాధిక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. స్వయంగా ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సంఘటన గురించి తలుచుకొని రాధిక ఒక్కసారే షాక్ తిన్నారట.