ఆ హీరో ఎఫెక్ట్ : ఎన్టీఆర్ బాలయ్య మధ్య చిచ్చు ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీ గా ఉంటాడో వేరే చెప్పనక్కర్లేదు. తన సహా నటులందరితోనూ సరదా సరదాగా ఉంటూ మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంటాడు. అయితే ఆ మంచి వ్యక్తిత్వమే ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆయన బాబాయ్ బాలయ్యకు మధ్య వైరం తెచ్చిపెట్టిందనే టాక్ ఇండ్రస్ట్రీ లో నడుస్తోంది. దీనంతటికీ కారణం ఓ యంగ్ హీరో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏంటి అంటే ? నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతుండదాంతో చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాతో పాటు ‘జెర్సీ’లో నాని నటనకు ఫిదా అయిపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో తీరిక లేకుండా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ఖాళీ చేసుకుని మరీ ఈ సినిమా చూసాడు. అంతేకాదు ఈ సినిమా చాలా బాగుంది అని మెచ్చుకుంటూనే నానిని ప్రశంసలతో ముచ్చెంతాడు.

అయితే అసలు చిక్కంతా ఇక్కడే వచ్చిపడింది. అదేంటంటే స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా జూనియర్ ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో పాటు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల గురించి మాట వరసకైనా ఒక్క మాట చెప్పకుండా ఇప్పుడు నాని సినిమాను పొగడడంపై బాలయ్య ఆగ్రహంగా ఉన్నాడట. ఏది ఏమైనా జెర్సీ సినిమా లో నాని నటనను మెచ్చుకున్న ఎన్టీఆర్ తన తాత బయోపిక్ ల విషయంలో కూడా పాజిటివ్ గా స్పందించి ఉంటే అనవసర విమర్శలు తప్పేవని మరొకొందరు సూచిస్తున్నారు.