Gossipsఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టెన్షన్..టెన్షన్..?

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టెన్షన్..టెన్షన్..?

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తూ వస్తుంది. ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు వర్మ చేసిన ప్రమోషన్ టీడీపీ పార్టీ సభ్యులకు మంట పెట్టినట్లు ఉంది. తమ అధినేతపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని..ఎన్నికల సమయంలో దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఈ సినిమాని నిషేదించాలని కోర్టు లో ఫిర్యాదు చేశారు.

మొత్తానికి ఈ సినిమా ఈసి పరిథిలోకి రావడం..ఏపిలో తప్ప ఇతర ప్రాంతాల్లో రిలీజ్ చేసుకోవొచ్చని చెప్పడం జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రేపు (మే1) విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే సినిమా విడుదలకు వారు సిద్ధమయ్యారు. దాంతో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది..ఇంకా ఏమైనా సమస్యలు చుట్టుముడుతాయా అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి చిత్రాలు విడుదల చేయవద్దని ఈ నెల 10న ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలపై ప్రభావం చూపే బయోపిక్ లను ప్రదర్శించరాదని ఈ ఆదేశాల్లో ఉంది. ఈ నేపథ్యంలో, కోడ్ అమల్లో ఉండే మే 23 వరకు ఈ సినిమాను విడుదల చేయడం కుదరదు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి వర్మ తన పంతం నెగ్గించుకుంటాడా లేదా అన్నది రేపటి వరకు తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news