ఎన్.టి.ఆర్ ను దాటేసిన ప్రభాస్.. సరికొత్త రికార్డ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు టాలీవుడ్ క్రేజీ స్టార్స్. ప్రభాస్ కన్నా ముందే తారక్ స్టార్ అయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను క్రాస్ చేశాడు. ఇంతకీ ప్రభాస్ ఏ విషయంలో తారక్ ను దాటేసి ముందుకెళ్లాడు అంటే ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో అని తెలుస్తుంది. ప్రభాస్ ఈమధ్యనే ఇన్ స్టాగ్రాం మొదలుపెట్టాడు.

అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొద్దిరోజుల్లోనే మిలియన్ మార్క్ దాటేశాడు. ఎన్.టి.ఆర్ కొన్నాళ్ల క్రితమే ఇన్ స్టాగ్రాం లో జాయిన్ అవగా ఇప్పటికి 8 లక్షలు అటు ఇటుగా మాత్రమే ఫాలోవర్స్ ఏర్పరచుకున్నాడు. వీరిద్దరి కన్నా మహేష్ 2 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటిస్థానంలో ఉన్నాడు. మొత్తానికి ప్రభాస్, ఎన్.టి.ఆర్ సినిమాలతోనే కాదు తమ ఫాలోవర్స్ లో కూడా పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రాం చరణ్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలే అవడం విశేషం. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.