మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా తర్వతా ఆరు వరుస విజయాలు అందుకున్నాడు నాని. ఆ తర్వాత వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. యూఎస్‌లో 132 లోకేషన్లలో ప్రీమియర్ షోల ద్వారా ‘జెర్సీ’ 1.44లక్షల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
2019లో ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల కలెక్షన్ల పరంగా జెర్సీ టాప్-5లో నిలిచింది. శుక్రవారం(ఏప్రిల్ 19) థియేటర్లలోకి వచ్చిన ‘జెర్సీ’ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.8కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నాని కెరీర్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో జెర్సీ ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు.
నాని దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌లో రూ.20కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు జెర్సీకి బ్రహ్మరథం పడుతున్నారు. స్టార్ హీరోలు కూడా నానికి కంగ్రాట్స్ చెబుతున్నారు. హిట్టింగ్‌కు తగినట్లుగానే తొలిరోజు పరుగులు(కలెక్షన్లు) కూడా బాగానే రాబట్టాడు నాని.
జెర్సీ వీక్ ఎండ్ కలెక్షన్లు :
నైజాం: రూ .4.92 కోట్లు
సీడెడ్: రూ .1 కోట్లు
వైజాగ్: Rs 1.31 కోట్లు
ఈస్ట్: రూ. 0.86కోట్లు
వెస్ట్: రూ.
కృష్ణ: రూ. 0.77 కోట్లు
గుంటూరు: రూ. .82 కోట్లు
నెల్లూరు: రూ .36 కోట్లు
ఎపి, తెలంగాణ: రూ .10.67 కోట్లు