బిగ్ బాస్-3 తెలుగు సీజన్ 15 మంది లీస్ట్..!

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో మంచి రన్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా..బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురలన్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాగితే..బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం అన్ని కాంట్రవర్సీలతోనే నడిచింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉండటంతో తెలుగులోనూ ప్రయోగాత్మకంగా నిర్వహించి సక్సెస్ అయ్యారు.

ఇక మూడో సీజన్‌కి సంబంధించి ఏప్రిల్ నెల వచ్చేస్తున్నా కసరత్తులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే కీలకమై హోస్ట్ కోసం ఇంకా వెతుకులాట సాగుతూనే ఉంది. నాని, ఎన్టీఆర్, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ.. కొత్తగా ఈసారి హీరోలు కాకుండా హీరోయిన్‌ హోస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తోంది.

తాజాగా తెరపైకి అనుష్క పేరు రావడంతో మొదట అందరూ ఆశ్చర్యపోయినా..ఇది కూడా ఒక ప్రమోషన్ ట్రెండ్ అన్నట్లు వదిలేశారు. బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ సీజన్ 3 కి కంటిస్టెంట్లు వీరే అంటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 3 కంటిస్టెంట్లు :

1. సుడిగాలి సుధీర్
2. యాంకర్ రష్మి
3. టీవీ నటి హరిత
4. వరుణ్ సందేశ్
5. హేమ చంద్ర
6. యాంకర్ ఉదయభాను
7. హీరో కమల్ కామరాజు
8. రేణు దేశాయ్
9. గుత్తా జ్వాల
10. మనోజ్ నందన్
11. జబర్దస్త్ పొట్టి రమేష్
12. కొరియోగ్రాఫర్ రఘు
13. కరాటే కళ్యాణి
14. కామన్‌మెన్
15. కామన్ ఉమెన్