టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి ఎప్పుడు సినిమా చేసినా అదో సెన్సేషన్ టాక్‌గా నిలుస్తోంది. స్టార్ హీరోలు మొదలుకొని కుర్ర హీరోల వరకు మాస్ ఎలివేషన్లతో హీరోలకు సక్సెస్ అందించే ఈ డైరెక్టర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’ అనే సినిమాతో ప్రేక్షకులకు అమృతాంజన్ ఖర్చు పెట్టించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు బిస్కెట్ తినిపించాడు మన బోయపాటి. అయితే ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్‌గా మిగలడంతో తన నెక్ట్స్ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు ఈ డైరెక్టర్.
అయితే తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో ఉంటుందని అప్పట్లోనే చెప్పిన బోయపాటి ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. కానీ బాలయ్య ప్రెస్టీజియస్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో బాలయ్య కూడా తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈ సమయంలో బోయపాటితో సినిమా కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్న బాలయ్య వెంటనే తన నెక్ట్స్ మూవీని కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నాడు. దీంతో బోయపాటి తన నెక్ట్స్ మూవీ విషయంలో మరోసారి డైలమాలో పడ్డాడు.
కాగా స్టార్ స్టేటస్లు అవసరం లేకుండా ఓ యంగ్ హీరోతో తన సత్తా ఏమిటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు బోయపాటి. దీనికి బాలయ్య కోసం బోయపాటి రెడీ చేసుకున్న కథను కుర్ర హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్. కాగా బోయపాటి ఈ సారి బడ్జెట్‌ను కాకుండా కంటెంట్‌ను నమ్ముకొని సినిమాను హిట్ చేయాలనే కసితో ఉన్నాడు. మరి బోయపాటి మార్క్ సినిమాలో హీరోగా రెచ్చిపోయే కుర్రాడు ఎవరనేది తెలియాలంటే సినిమా సెట్స్‌పైకి వెళ్లేవరకు వెయిట్ చేయాల్సిందే.