మామకు చెక్ పెట్టిన కోడలు..!

అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన సమంత వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతోంది. అటు సోలో హీరోయిన్‌గా వరుస బెట్టి సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేస్తోంది ఈ బ్యూటీ. చైతూతో పెళ్లి తరువాత అమ్మడు చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అవుతుండటంతో సమంత ఎలాంటి సినిమాతో వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పెళ్లి తరువాత నాగార్జునతో రాజు గారి గది-2 చిత్రంలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి మన్మధుడు 2లో నాగ్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే ఒక్క విషయంలో నాగ్‌కు సమంత చెక్ పెట్టింది.

నాగ్‌కు సమంత చెక్ పెట్టడమేంటని అనుకుంటున్నారా.. అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. నాగార్జున సినిమాలతో పాటు చాలా యాడ్స్‌లో మనకు కనిపిస్తుంటాడు. నాగ్ గత కొన్నేళ్లుగా చేస్తున్న XXX డిటెర్జెంట్ యాడ్‌ టీవీ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. కాగా ఇప్పుడు నాగ్‌ ఈ యాడ్‌లో కనిపించడు. దీనిక కారణం సమంత అని తెలుస్తోంది. సమంత ప్రస్తుతం ఉన్న భీబత్సమైన ఫాంతో అమ్మడిని ఈ యాడ్ ఓనర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. మంచి రెమ్యునరేషన్‌ కూడా ఉండటంతో అమ్మడు ఈ యాడ్ చేసేందుకు వెంటనే ఒప్పేసుకుంది.

ఏదేమైనా నాగ్ చేస్తున్న యాడ్‌ను సమంత లాగేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏదేమైనా మామ ఛాన్స్‌ను కోడలు లాగేసుకోవడంతో సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్‌లో ఓహ్ బేబీ అనే సినిమాలో నటిస్తోంది.

Leave a comment