ఈ మద్య స్టార్ హీరోల సినిమా లు భారీ బడ్జెట్ం తో తీస్తున్నారు. స్టార్ హీరో సినిమాలు పూజా కార్యక్రమం నుంచి రిలీజ్ అయ్యే వరకు తెగ హంగామా చేస్తూ వస్తున్నారు. తీరా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఘోర పరాజయం పొందడంతో తొక ముడుస్తున్నారు. గత సంవత్సరం రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘వినయ విధేయ రామ’తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.
రెండు లక్షల అరవై వేల డాలర్ల గ్రాస్ కలక్షన్లతో భారీ సినిమాల్లో ఘోరమైన పరాజయంగా గుర్తుండిపోయింది. ఈ యేడాది ఇదే పెద్ద డిజాస్టర్ సినిమా అనుకుంటున్న సమయంలో దానికి పోటీగా మరో స్టార్ సినిమా ఎంట్రీ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణనుంచి వచ్చిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఆ రికార్డుని బీట్ చేసే దిశగా సాగుతోంది. ఆదివారం వరకు రెండు లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ మూవీ ఇక ఫుల్ రన్‌లో మరో యాభై, అరవై వేల డాలర్లు సాధిస్తుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకి ప్రీమియర్లకే నాలుగు లక్షల డాలర్లకి పైగా వసూలయితే, మహానాయకుడు మొత్తం వసూళ్లు ప్రీమియర్ వసూళ్లని దాటవని తేలిపోయింది. ఇంతటి ఘోర పరాభవాన్ని అయితే వైరి హీరోల అభిమానులు కూడా ఊహించలేదు. తొలి మూడు రోజుల్లో షేర్లు లేక పర్సంటేజీ పద్ధతిలో షేర్లు క్యాలిక్యులేట్ చేసి చెప్పుకున్న ఈ సినిమా శని, ఆది, సోమవారాల్లో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి.