తమిళ హీరో కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా దేవ్. ఆల్రెడీ ఈ ఇద్దరు ఖాకి సినిమాలో నటించారు. రవి శంకర్ డైరక్షన్ లో ప్రస్తుతం దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఉక్రెయిన్ లో ఉంటున్న దేవ్ (కార్తి) ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి తనకు మేఘన (రకుల్ ప్రీత్ సింగ్) చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ప్రతిది బిజినెస్ మైండ్ తో ఆలోచించే మేఘన దేవ్ ను అసలు పట్టించుకోదు. అయినా సరే ఆమె ప్రేమ కోసం దేవ్ ప్రయత్నిస్తాడు. అలాంటి టైం లో దేవ్ కు ఒక టాస్క్ ఇస్తుంది. మరి దేవ్ మేఘన మనసు గెలిచేందుకు ఏం చేశాడు..? చివరికి వారి కథ ఏమైంది అన్నది సినిమా.
నటీనటుల ప్రతిభ :
దేవ్ గా కార్తి అదరగొట్టాడు. తనకున్న టైమింగ్ తో ఇంప్రెస్ చేశాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్ తో అదరగొట్టింది. మేఘన పాత్రలో రకుల్ మంచి మార్కులు కొట్టేసింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, వంశీ కృష్ణ పాత్రలు ఇంప్రెస్ చేశాయి. విహ్నేష్ కాంత్, అమృతల మధ్య సీన్స్ కూడా బాగున్నాయి. మితతా పాత్రలన్ని పారిధి మేరకు నటించి మెప్పించాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
వెల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది.. హారీస్ హైరాజ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. రవి శంకర్ కథ వీక్ గా ఉంది. కథనం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ :
ఇద్దరు విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల ప్రేమకథ దేవ్. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు ఉన్న హీరో.. బిజినెస్ లో అంచెలంచలుగా ఎదగాలని అనుకున్న హీరోయిన్ కు హీరో ప్రేమను ఎలా ఒప్పించాడు అన్నది కథ. దర్శకుడు రవిశంకర్ రాసుకున్న కథ బాగున్నా కథనం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.
మొదటి భాగం బాగానే అనిపించినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అవడం వల్ల బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం కూడా మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా దేవ్ తో కార్తి అటెంప్ట్ బాగున్నా పెద్దగా ఆకట్టుకోలేదన్నది టాక్.
ప్లస్ పాయింట్స్ :
కార్తి, రకుల్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ
స్క్రీన్ ప్లే
బాటం లైన్ : దేవ్ గా మెప్పించలేక పోయిన కార్తి..!
రేటింగ్ : 2/5