Gossips" లవర్స్ డే " రివ్యూ & రేటింగ్..!

” లవర్స్ డే ” రివ్యూ & రేటింగ్..!

లవర్స్ డే రివ్యూ & రేటింగ్

కన్నుగీటి ప్రపంచమంతా సెన్సేషన్ గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే గా ఈరోజు ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయ్యింది. రోషన్ అబ్ధుల్, ప్రియా ప్రకాశ్ నటించిన ఈ సినిమాను ఒమర్ లులు డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

డాన్ బోస్కో స్కూల్ లో చదువుతున్న హీరో, హీరోయిన్ ఒకరిని ఒకరు చూడగానే ఇష్టపడతారు. హీరోయిన్ హీరోని ఆటపట్టించేలా కన్ను గీటి అతన్ని డిస్ట్రబ్ చేస్తుంది. ఆ దెబ్బతో ఆమె వెంట పడుతుంటాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటాడు. హీరో, హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసుకోవడం యాక్సెప్ట్ చేయడం అంతా బాగుంది అనుకున్న టైంలో సడెన్ గా హీరోయిన్ హీరోకి దూరం అవుతుంది. అలా దూరం అవడానికి కారణాలేంటి..? హీరోయిన్ దూరమైన టైంలో హీరో మరో అమ్మాయికి ఎలా దగ్గరయ్యాడు..? చివరకు హీరో హీరోయిన్ ఎలా కలిశారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో రోషన్ అభుల్ టీనేజ్ కుర్రాడిగా బాగా చేశాడు. ఆ ఏజ్ లో ఉండే చాలాకి తనం.. స్పీడ్ అంతా అలానే చేశాడు. ఇక ప్రియా ప్రకాశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నిమిషం టీజర్ తోనే సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాశ్ సినిమా మొత్తం తను స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మిగతా పాత్రలన్ని మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

షాన్ రెహమాన్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ప్రియా ప్రకాశ్ ను చాలా అందంగా చూపించారు. ఒమర్ లులు కథ అంత గొప్పగా లేకున్నా టీమేజ్ లవ్ స్టోరీగా లవర్స్ డె స్క్రీన్ ప్లే బాగానే ఉంది. గురు రాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కించారు.

విశ్లేషణ :

తెలుగులో టీనేజ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులైంది. ఇక కనుసైగలతో బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ నటించింది కాబట్టి లవర్స్ డే మీద ఆడియెన్స్ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చే అంశాలు ఉన్నాయి. అయితే కథ, కథనాలు రొటీన్ అని చెప్పొచ్చు.

హీరో, హీరోయిన్ ఫస్ట్ సైట్ లోనే ప్రేమించుకోవడం.. ఆ తర్వాత దగ్గరవడం.. విడిపోవడం ఇలా రొటీన్ స్టోరీతోనే వచ్చారు. లవర్స్ డే టైటిల్ సినిమా కథకు బాగా కుదిరింది. అయితే సినిమాలో అసలైన స్టఫ్ పెద్దగా లేకపోవడంతో పెద్దగా మెప్పించలేదు. మళయాళంలో ఇలాంటివి కొత్తగా అనిపించొచ్చు కాని తెలుగు వారికి ఇలాంటి సినిమాలు చాలా చూసేశాం అన్న భావన ఉంటుంది.

మొత్తానికి లవర్స్ డే పక్కా యూత్ ఎంటర్టైనర్ మూవీ.. ప్రియా ప్రకాశ్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

సినిమాటోగ్రఫీ

కామెడీ

మైనస్ పాయింట్స్ :

డబ్బింగ్

స్టోరీ

బాటం లైన్ :

లవర్స్ డే.. కేవలం ప్రియా ప్రకాశ్ కోసమే..!

రేటింగ్ : 3.0/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news