టాలీవుడ్ స్టార్ డైరక్టర్ లిస్ట్ లో టాప్ 5లో ఉన్న బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బాగా దెబ్బతిన్నాడు. ఆ సినిమా ఫలితం అటుంచితే డిస్ట్రిబ్యూటర్స్ కోసం రెమ్యునరేషన్ లో కొంత తిరిగి ఇవ్వాలని నిర్మాత దానయ్య కోరగా దానికి తిరస్కరించాడు బోయపాటి. ఆ విషయంపై నిర్మాతలంతా బోయపాటి శ్రీనుని దూరం పెడుతున్నారు. వివి ఆర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా బాలకృష్ణ సినిమా ఇచ్చాడు. అయితే ఫిబ్రవరిలో మొదలవుతుంది అనుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు.
అసలే ఎన్.టి.ఆర్ బయోపిక్ తో డీలా పడిన బాలకృష్ణ బోయపాటితో సాహసం అవసరమా అనుకుంటున్నాడట. సినిమా బడ్జెట్ కూడా 50 కోట్లు చెప్పాడట అందుకే బోయపాటి సినిమాకు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే బోయపాటికి మైత్రి మూవీ మేకర్స్ వారు కొంత అడ్వాన్స్ ఇచ్చారు. మీతో సినిమా వద్దని వారు కూడా బోయపాటి శ్రీను దగ్గర నుండి అడ్వాన్స్ తీసుకున్నారట. ఎలా చూసినా బోయపాటికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు.
మరి ఇప్పుడు బోయపాటి శ్రీను ఏం చేస్తాడు అన్నది చూడాలి. కెరియర్ లో దమ్ము ఫ్లాప్ అయినా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు కాని వివిఆర్ మాత్రం బోయపాటిని బాగా వెనక్కి నెట్టేసింది. ముఖ్యంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ గొడవ వల్ల దర్శకుడి ఇమేజ్ కు బాగా డ్యామేజ్ అయ్యింది. మరి ఈ గొడవల్లో బోయపాటితో ఏ నిర్మాత సినిమా తీసేందుకు ముందుకొస్తాడో చూడాలి.