Newsవాయిదా పడుతున్న మహానాయకుడు..!

వాయిదా పడుతున్న మహానాయకుడు..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా వారం లో 20 కోట్లు కూడా రాబట్టలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ కు గల కారణాలు విశ్లేషించుకుంటూ మహానాయకుడులో అవి రిపీట్ అవకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను ముందు ఫిబ్రవరి 7న రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా ఇప్పుడు ఓ వారం వెనక్కి వెళ్తున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి 14న మహానాయకుడు వస్తాడని తెలుస్తుంది.

అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయని తెలుస్తుంది. అంతేకాదు కథానాయకుడు సినిమా బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టాయని తెలుసుకున్న బాలయ్య మహానాయకుడు హక్కులను వారికి ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మహానాయకుడు సినిమా అయినా అంచనాలను అందుకునేలా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాణానికి 60 కోట్లు ఖర్చు కాగా ఒక్క మొదటి పార్టుకే 80 కోట్ల దాకా బిజినెస్ జరిగింది.

సినిమా నిర్మాతగా బాలకృష్ణకు ఎలాంటి లాసు లేదు. అయితే తండ్రి సినిమా కొని బయ్యర్లు నష్టపోకూడదని కథానాయకుడు బయ్యర్స్ కు మహానాయకుడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడట. ఫిబ్రవరి 14న వస్తున్న ఈ మహానాయకుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news