సంక్రాంతికి పందెం కోడిగా వచ్చిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ వినయ విధేయ రామ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బోయపాటి శ్రీను, రాం చరణ్ కాంబో మూవీ అనగానే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ కూడా అంచనాలు మరింత పెంచింది. తీరా సినిమా చూసేసరికి తేడా కొట్టేసింది. మితిమీరిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు విసుగుతెప్పించాయి. ఇదవరకు బోయపాటి సినిమాలో వయిలెన్స్ ఉన్నా కాస్త ఎమోషనల్ గా అయినా వర్క్ అవుట్ అయ్యేది ఈ సినిమాలో అది కూడా మిస్సైంది.
అసలు ఇంతకీ రాం చరణ్ ఫైనల్ ప్రొడక్ట్ చూడలేదా ఇలా ఎలా రిలీజ్ చేశారని అందరికి డౌట్ వచ్చింది. చరణ్ మాత్రమే కాదు అతని ప్రతి సినిమా చిరు కనుసన్నల్లోనే ఉంటుంది. చిరంజీవి వివిఆర్ అవుట్ పుట్ చూడకుండానే రిలీజ్ చేశారా అంటే అవుననే తెలుస్తుంది. సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ కాపీ చిరంజీవి చూడలేదట. షూటింగ్ స్పాట్ కి వెళ్లి రష్ చూసి శభాష్ అన్నాడే తప్ప ఫైనల్ అవుట్ పుట్ చూడలేదట.
సుకుమార్ రంగస్థలం విషయంలో నమ్మకం ఉంచమని చెప్పిన చరణ్ మాటలను గుర్తుంచుకుని ఈ సినిమాకు ఫస్ట్ కాపీ చూడకుండా వదిలాడట చిరంజీవి. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే జరగాల్సిన నష్టం జరిగింది. ఒకవేళ రిలీజ్ ముందు సినిమా చూసి ఉంటే పరిస్తితి వేరేలా ఉండేదని అంటున్నారు. 150 సినిమాల అనుభవం ఉంది కాబట్టి వివి ఆర్ చిరు కట్స్ చాలా ప్రత్యేకంగా ఉండేది. ఇప్పుడే కాదు ఇదవరకు చిరు ప్రమేయంతో చివరి నిమిషంలో కొన్ని సీన్స్ ట్రిం చేయడం వల్లే నాయక్, రచ్చ సినిమాలు హిట్ అయ్యాయట. మరి వినయ విధేయ రామ కూడా అలానే ముందు చిరంజీవికి చూపిస్తే బాగుండేది. అయినా ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం వివి ఆర్ వచ్చింది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే చరణ్ స్టామినా చూపించేలా వసూళ్లు మాత్రం ఘోరంగా ఏం లేవు. ఇప్పటికే సినిమా 55 కోట్ల మార్క్ దాటేసింది.