ఈ వయసులో పోర్న్ స్టార్ అవుతున్న రమ్యకృష్ణ..!

Ramya krishna new film updates

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు. అదేంటి ఇప్పటికి తన టాలెంట్ తో సినిమాలో ఛాన్సులు దక్కించుకుంటున్న రమ్యకృష్ణ ఈ వయసులో పోర్న్ స్టార్ గా మారడం ఏంటి అంటే ఓ సినిమా కోసం అది చేయక తప్పట్లేదని అంటున్నారు. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, సమంత జంటగా సూపర్ డీలక్స్ సినిమా తెరకెక్కుతుంది. త్యారజన్ కుమారాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే రమ్యకృష్ణ కెరియర్ లో టఫ్ క్యారక్టర్ అది కూడా ఇలాంటి టైంలో ఒప్పుకోవడం విశేషం. 80, 90 లలో యువత మనసులు గెలిచిన రమ్యకృష్ణ తన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ సర్ ప్రైజ్ ఇవ్వనుందట. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు వెళ్లడించడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా లేడీ గెటప్ లో కనిపిస్తారట.

మొత్తానికి రమ్యకృష్ణ కెరియర్ లో పోర్న్ స్టార్ పాత్ర చేయడం పట్ల ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ శృంగార తారగా అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు అందరు అవాక్కవడం గ్యారెంటీ అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సూపర్ డీలక్స్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment