ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ ఎంత క్లోజ్ గా ఉండేవారో సినిమాల్లో చూపించారు. సమ ఉజ్జీలు అంటూ ఓ డైలాగ్ కూడా సినిమాలో ఉంది. అయితే ఆ వారసత్వం కొనసాగించి హీరోలుగా బాలకృష్ణ, నాగార్జున మంచి సక్సెస్ ట్రాక్ కొనసాగించారు. అయితే అంతకుముందు వారి మధ్య సంబంధాలు బాగున్నా ఇప్పుడు కాస్త దూరం పెరిగిందని తెలుస్తుంది. అందుకే సినిమాలో ఏయన్నార్ పాత్రకి సుమంత్ ని తీసుకున్నారే తప్ప నాగార్జునని కాని నాగ చైతన్యని కాని అడుగలేదు.
ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సాహసం చేసిన బాలకృష్ణ ఇప్పుడు నాగార్జునని భయపెడుతున్నాడు. అలా ఎందుకు అంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తెచ్చిన ఫలితమే అని అంటున్నారు. తన తండ్రి ఏయన్నార్ బయోపిక్ ఆలోచన ఉన్నా ఎన్.టి.ఆర్ బయోపిక్ రిజల్ట్ చూసి ముందడుగేద్దాం అనుకున్నాడు నాగార్జున. కాని ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఫలితం నాగార్జునకు షాక్ ఇచ్చింది. అందుకే ఇక ఏయన్నార్ బయోపిక్ మర్చిపోవాల్సిందే అంటున్నారు.
ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా అయినా ఆశించినట్టుగా ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ టాక్ బాగున్నా వసూళ్ల పరంగా మాత్రం బాగా దెబ్బకొట్టింది.