Newsనన్ను కూడా వదల్లేదు అంటున్న హన్సిక..

నన్ను కూడా వదల్లేదు అంటున్న హన్సిక..

దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లీ బ్యూటీ హన్సిక ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. కాగా ఆ మధ్య ఫేడవుట్ హీరోయిన్‌గా తెలుగులో కనబడకుండా పోయిన హన్సిక ఇప్పుడు మళ్లీ కొన్ని సినిమాలు చేస్తోంది. అయితే తమిళంలో మాత్రం ఈ పాపకు అదిరిపోయే ఆఫర్లతో రచ్చ చేస్తోంది. అయితే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎదుర్కొన్న సమస్య ఇప్పుడు తాను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పింది హన్సిక.

స్టార్లకు సంబంధించిన ఫోన్లను, సోషల్ అకౌంట్లను హ్యాక్ చేస్తుంటారు హ్యాకర్లు. తాజాగా వీరి బారిన పడింది హన్సిక. తన ఫోన్లను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు వాపోయింది ఈ బ్యూటీ. తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ భాగోతం బయటపడింది. తనకు తెలియకుండానే ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో హన్సిక షాక్‌కు గురయ్యింది. వెంటనే తన టీమ్‌కు చెప్పి తన ఫోన్ ఎవరు హ్యాక్‌ చేశారో తెలుసుకోవాలని చెప్పింది. తన ఫ్యాన్స్‌ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను కూడా ఫాలో కావద్దని కోరింది.

ఇలా హ్యాకర్లు తనను కూడా వదల్లేదని ఫీల్ అవుతున్న హన్సిక, ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడంతో ఏం చేయాలో తెలీక తలపట్టుకుంది. ఏదేమైనా ఇది చట్ట వ్యతిరేక పనిగా ఆమె పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news