రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాల్లోనే కనబడుతుంటాడు. ఆయనకు సంబంధం..ఉన్నా … లేకపోయినా… ఆయన పేరు వినిపిస్తే చాలు అదో కాంట్రవర్సీ సబ్జెక్టు అని అంతా డిసైడ్ అయిపోతారు. తాజాగా వర్మ శిష్యుడు సిద్దార్ధ డైరెక్షన్ లో వచ్చిన భైరవ గీత వెండి తెర మీదకు వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ అయ్యిందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే … ఆ సినిమా లో హీరోయిన్ అందచందాలను రొమాంటిక్ గా చూపించడంలో మాత్రం బాగా ఫోకస్ పెట్టారట. దీంతో ఇప్పుడు అందరికి ఆ సినిమా మీద కొత్త డౌట్ స్టార్ట్ అయ్యింది. నిజంగా ఈ సినిమా సిద్దార్ధ తీసాడా లేక వర్మ తీసాడా అని.
అయితే ఈ సినిమా హీరోయిన్ మాత్రం తన అందచందాలన్నిటిని బాగా వాడేశారు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతోంది. అయితే ఈ సినిమా చూసినవారు మాత్రం పిచ్చెక్కిపోతున్నారట. అందులో హీరోయిన్ అందాలు ఓ రేంజ్ అనేకంటే… ఏం రేంజో అర్థంకాని స్థాయిలో చూపించేశారట. హీరోయిన్ అందాలను చూపించేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టి హాట్ సినిమాగా మార్చేశారు.
ఇక కెమేరాను ఎన్ని యాంగిల్స్ నుంచి తీయాలో అన్ని యాంగిల్స్ నుంచి లాగించేశారట. హీరోయిన్ కూడా బాగా సహకరించడంతో అనుకున్నట్టుగానే ఈ సినిమా హాట్ హాట్ అందాలకు ఏమాత్రం కొదవ లేకుండా ఉన్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, చి. ల. సౌ, గూఢచారి, గీత గోవిందం వంటి చిత్రాల్లో లిప్ లాక్ ఉండటం ఆ సినిమాలు హిట్ కావడంతో అదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ ‘భైరవ గీత’ సినిమాను కూడా ఆ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని హాట్ మసాలా సీన్లు తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వదిలారు.
అన్ని యాంగిల్స్ లో ఆ హీరోయిన్ ని పిండేశారట !
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి