నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. బాలకృష్ణ నిర్మాతగా మారి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ అయితే నందమూరి ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైం 25 కోట్లకు కొనేశారట.
తెలుగు, తమిళ, హింది వర్షన్స్ కలుపుని ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు అమేజాన్ ప్రైజ్ పాతిక కోట్లు వెచ్చించారట. ఇంకా శాటిలైట్ రైట్స్ లెక్క తేలలేదు. మరో పక్క థియేట్రికల్ రైట్స్ కూడా ఆకాశాన్నంటే రేంజ్ లో పలుకుతున్నాయి. ఎన్.టి.ఆర్ సినిమామా రంగానికి చెందిన మొదటి పార్ట్ కాబట్టి కథానాయకుడు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పార్ట్ లోనే బాలకృష్ణ దాదాపు 60 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది.
కథానాయకుడు బిజినెస్ తోనే ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ లాభాల బాట పట్టేలా ఉంది. ఇక మాహానాయకుడు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. అసలైతే రెండు కలిపి రైట్స్ కొనేస్తారు కాని బాహుబలి రూట్ లోనే రెండు పార్టులను రెండు సినిమాలుగా ప్రమోట్ చేసి ఒక సినిమాకు రెండు టికెట్లు అంటే రెండు సార్లు డబ్బులు పెట్టి చూసేలా చేశారు. తెలుగు జాతి గొప్పతనం చాటిచెప్పిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కచ్చితంగా నేటి యువతరానికి గొప్ప ఆదర్శప్రాయం అవుతుందని చెప్పొచ్చు.