Gossipsమహర్షి ఇంటర్వల్ బ్లాక్.. ఏంటి ఆ సస్పెన్స్..?

మహర్షి ఇంటర్వల్ బ్లాక్.. ఏంటి ఆ సస్పెన్స్..?

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ మహర్షి. దిల్ రాజు, అశ్వని దత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా మహేష్ బాబు 25వ సినిమా కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంటర్వల్ బ్లాక్ అదిరిపోయేలా ప్లాన్ చేశాడట వంశీ పైడిపల్లి.

సినిమాలో మహేష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చేస్తున్నాడట. ఒక్కడే అన్ని రెండు మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇంటర్వల్ ఎపిసోడ్ మాత్రం దుమ్ముదులిపేస్తుందట. ఇంటర్వల్ బ్లాక్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తుందట. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఊపిరి తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహర్షి సినిమాలో మహేష్ పూర్తి స్థాయి మేకోవర్ తో కనిపిస్తాడట. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందట. అంతేకాదు సినిమాలో మహేష్, నరేష్ ల మధ్య వచ్చే సీన్స్ మాత్రం అదిరిపోతాయని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి త్వరలోనే మొదటి సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news