కొంతకాలం క్రితం వరకూ సినిమాలు అంటే శంకర్ సినిమాల ఊసే ఉండేది..శంకర్ తీసినవే సినిమాలు గా చెప్పుకునే వారు.. అసలు డైరెక్టర్ పేరు చూసి సినిమాలకి వెళ్ళడం బహుశా శంకర్ నుంచీ మొదలయ్యిందనే చెప్పాలి. భారతదేశం లోనే ఓ గర్వించదగ్గ సినిమా దర్శకుడిగా శంకర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.. అయితే తాడి తన్నే వాడు ఉంటే దాని తలతన్నే వాడు ఉంటాడు అంటారు సరిగ్గా ఇప్పుడు శంకర్ కి అదే పరిస్థితి ఎదురయ్యింది…
బాహుబలి రానంతవరకూ ఓ లెక్క బాహుబలి వచ్చాక మరో లెక్క..అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి..శంకర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మారుమోగిందే ఇప్పుడు బాహుబలి 1 ,2 ల క్రేజ్ తో రాజమౌళీ ఫేం కూడా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగో పోయింది..ఎంతగా అంటే శంకర్ ని మరిపించెంతగా..తన బాహుబలి సినిమా రికార్డులని ఎవరూ చేధించలేనంతగా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రికార్డుల విషయంలో ఈ ఇద్దరి సినిమాలకి అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో గట్టిపోటీ పెరిగిపోయింది..
రెండు సినిమా వర్గాలలో ఒకే చర్చ ప్రస్తుతానికి నడుస్తోంది అదేంటంటే.. శంకర్ “2.ఓ” రాజమౌళి “బాహుబలి 2” రికార్డుల్ని బీట్ చేస్తుందా…???? అసలు బాహుబలిని తలదన్నే సీన్ “2.ఓ” కి ఉందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది…నిజానికి 2.ఓ ట్రైలర్ చూసిన ఎంతో మంది సినిమా క్రిటిక్స్ ఆ ట్రైలర్ పై పెదవి విరుస్తున్నారు. ఇది శంకర్ సినిమా ట్రైలర్ నా కాదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా 3డిలో చూసినప్పుడు మాత్రమే ఆ విజువల్స్ వేరియేషన్ తెలుస్తోంది అంటూ కౌంటర్ ఇస్తున్నారు..
సరే మరి బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేయగలదా అంటే… ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది..అదేంటంటే. 2.ఓ సూపర్ డూపర్ అవ్వడం ఖాయమే అయితే బాహుబలి 2 ని బీట్ చేయలేదు అంటూ తడుమోకుండా చెప్పేస్తున్నారు….ఎందుకంటే బాహుబలి 2 చిత్రం మొదటి రోజు కేవలం ఇండియాలో దాదాపు 122కోట్ల నెట్ వసూలు చేసింది. అంటే గ్రాస్ 150కోట్లు పైమాటే..ఇప్పుడు ఒకవేళ ఆ రికార్డులు బ్రేక్ చేయాలని అనుకున్నా సరే ప్రఖ్యాత తమిళ క్రిటిక్ రమేష్ బాలా అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం…
ఈ సినిమా మొదటి రోజు 100కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారట…అంటే బాహుబలి రికార్డు దరిదాపులకి కూడా చేరుకోలేదట.. ఇదిలాఉంటే ఈ సినిమా ముందస్తుబుకింగ్ లేక్ హిందీ వెర్షన్ లో దాదాపు 35కోట్ల నెట్ లెక్క తేలిందని అంటున్నారు మరి ఒక్క హిందీ వెర్షన్ 35కోట్ల కి చేరుకుంటే ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.