స్టార్ హీరోల్లో ఎవరికి లేని నవసర కళాపోషణ నందమూరి తారక రామారావుకి ఉందని చెప్పొచ్చు. తాత పంచిన రక్తబంధమే కాదు ఆయన సిని వారసత్వాన్ని కూడా అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కళ కోసం పడే తపన అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఓ పక్క తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినా ఇచ్చిన మాట ప్రకారం నిర్మాత శ్రేయస్సు కోసం చావు ఇంటి నుండి షూటింగ్ స్పాట్ కు ఐదోరోజు నుండే వెళ్లి సినిమా మీద తమకున్న గౌరవం ఎంత అన్నది చూపించాడు.
షూటింగ్ క్యాన్సిల్ చేసి నెల రోజులు ఇంట్లోనే ఉన్నా ఎవరు అడిగే వారు ఉండరు. పోయిన మనిషి ఎలాగు రాడు అందుకే ఆయన చెప్పిన ధర్మ సూత్రం ప్రకారంగా ఇచ్చిన కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకుని అరవింద సమేత షూటింగ్ పూర్తి చేశాడు ఎన్.టి.ఆర్. ఇక తండ్రి మరణం తర్వాత అభిమానుల ముందుకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డ తారక్ ఫైనల్ గా నిన్న వారి ముందు తన బాధని.. బాధ్యతని వ్యక్తపరిచాడు.
తన తండ్రి మీద ఇష్టాన్ని వర్ణిస్తూ అభిమానుల్లో తన తండ్రిని చూసుకుంటున్నా అని అన్నాడు తారక్. పైన ఆయనకి ఈయన అవసరం ఉంది అనుకుంటా అందుకే తొందరగా తీసుకెళ్లారని అన్నాడు. స్టార్ హీరో ఇమేజ్ ఉన్న తారక్ అభిమానుల ముందు చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అందుకే త్రివిక్రం నిజజీవితంలో హీరో అని ఎన్.టి.ఆర్ ను అన్నాడు. మొత్తానికి అభిమానుల కోసం దిగి వచ్చిన ఎన్.టి.ఆర్ కు నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయన బాధని షేర్ చేసుకున్నారు.
తండ్రి చనిపోయినా ఫ్యాన్స్ కోసం దిగి వచ్చిన ఎన్.టి.ఆర్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి