భార్య నుండి కాపాడండి అంటున్న ఇండియన్ క్రికెటర్..!

ఇండియ క్రికెటర్ మహ్మద్ షమి మరోసారి తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాడు. ఇండియన్ క్రికెటర్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడుతున్న షమిపై అతని భార్య హాసీన్ చేసిన హంగామా తెలిసిందే. పెళ్లి కాకముందు నుండి షమికి అమ్మాయిలపై మోజు ఉందని. అంతేకాదు ఒకరిద్దరితో సన్నిహిత సంబంధాలున్నాయని షమి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హాసీన్.
1
దీనిపై కోర్ట్ మెట్లెక్కగా భార్య నుండి వేరుగా ఉంటూ కుటుంబపోషణ కోసం నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అయితే నెలకు తనకు లక్ష కాదు 10 లక్షలు కావాలని.. తనని సోదరుడి పడక గదికి పంపించాడని వ్యాఖ్యలు చేసింది హాసీన్. కోర్టు కూడా 10 లక్షలు కుటుంబపోషణకు ఇవ్వడం కుదరదని చెప్పింది.
2
అయితే ఇప్పుడు షమి తన భార్య వల్ల తనని ప్రాణ హాని ఉందని. ఆమె నుండి తనని కాపాడండి అని మెజిస్ట్రేత్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. తనని కావాలనే ఆమె టార్చ పెడుతుందని.. ఆమె నుండి తనకు ఎలాంటి హాని జరుగకుండా సెక్యురిటీ కల్పించాలని కోరాడు.

Leave a comment