అర్జున్ రెడ్డి .. గీతగోవిందం సినిమాలతో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అదే స్థాయిలో ‘నోటా’ సినిమా ద్వారా అపకీర్తిని కూడా తన ఖాతాలో వేసేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘నోటా’ సినిమా ద్వారా విజయ్ రేంజ్ ఎక్కడికో ……. వెళ్ళిపోతుంది అనుకుంటే .. ఎక్కడికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయింది. మొదటి రోజు టాక్ తో పని లేకుండా 7.50 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే రెండో రోజు నుంచి సినిమా దారుణంగా పడిపోయింది. ఆదివారం కనీస వసూళ్లు కూడా తీసుకురాలేదు. ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం 9 .25 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. ఈ చిత్రం హిట్ కావాలంటే 25 కోట్లు రావాలి.
ఓవర్సీస్ లో అయితే కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు ఈ చిత్రం. అక్కడ డిజాస్టర్ లకే డిజాస్టర్ గా నిలిచింది నోటా అయితే ఇప్పుడు నోటా మాత్రం విజయ్ కు పెద్ద షాకే. ఎందుకంటే ఈ సినిమాతోనే తమిళనాట కూడా అడుగుపెట్టాడు విజయ్. కానీ తొలి సినిమాతోనే షాక్ తిన్నాడు. ఇప్పుడు నోటా పరిస్థితి చూస్తుంటే కనీసం 10 కోట్లు ముంచేలా కనిపిస్తుంది.
నిజాం : Rs 3.23 కోట్లు , సీడెడ్ : 0.96 కోట్లు, వైజాగ్ : 0.80 కోట్లు, గుంటూరు : 0.61 కోట్లు, : Rs 0.52 కోట్లు, : Rs 0.32 కోట్లు, కృష్ణ : 0.47 కోట్లు, నెల్లూరు : 0.29 కోట్లు , ఏపీ తెలంగాణ కలిపి మొత్తం 7.20 కోట్లు వసూల్ చేసింది. ఇండియా వైజ్ గా 0.80 కోట్లు, అలాగే ఫారిన్ కలెక్షన్ 1 .25 కోట్లు . మొత్తంగా చూస్తే ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ 9 .25 కోట్లుగా లెక్కతేలింది.