ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు కు అభిమానులున్నారు.ప్రస్తుతం ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్న ఆయన పనిలో పనిగా అక్కడ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే అనుకోకుండా మహేష్ కు అమెరికాలో ఘోర అవమానం జరిగింది. ఈ నెల 27 న అమెరికాలో జరగాల్సిన ఫండ్ రైజింగం ఈవెంట్ కు ఆయనే చీఫ్ గెస్ట్. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు నిర్వాహకులు. ఎందుకంటే ఈవెంట్ టిక్కెట్స్ ఆశించిన స్థాయిలో అమ్ముడు కాలేదట.
మొదటగా ఈ ఈవెంట్ ను లిమిటెడ్ టికెట్స్ తో అమెరికాలోని 100 కుటుంబాలతో మహేష్ 5 స్టార్ హోటల్లో టాప్ క్లాస్ డిన్నర్ ఏర్పాటు చేసారు అయితే టికెట్ ధరను 2 వేల డాలర్లు గా పెట్టారు కానీ… నిర్వహాకులకు ఊహించని షాక్ తగిలింది ఈ ఈవెంట్ కు వచ్చేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదట. దీంతో టికెట్ ధర 450 డాలర్లకు తగ్గించారు. అయినా… టిక్కెట్లు కొనేవారు కరువయ్యారు. దీంతో ఈవెంట్ నిర్వహాకులకు ఏం చెయ్యాలో తెలియక మొత్తానికి ఈవెంట్ నే క్యాన్సిల్ చేసారని తెలిసింది.
మహేష్ లాంటి స్టార్ హీరోతో కలసి డిన్నర్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవటం ఇప్పుడు అమెరికలో వున్న తెలుగు వాళ్లలో పెద్ద చర్చనే జరుగుతుంది.ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మా అసోసియోషన్ లో వున్న విభేదాల వల్లనే షో క్యాన్సిల్ అయిందని మహేష్ సన్నిహితులు చెప్తున్నారు.
మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. అంతే కాకుండా… తాను రన్ చేస్తున్న ఒక హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయాలనీ మహేష్ భావించారు. కానీ మా అసోసియేషన్ ముఖ్య సభ్యులు శ్రీకాంత్, నరేష్, శివాజీరాజాల నడుమ విభేదాలు తలెత్తడం, గతంలో చిరంజీవితో చేసిన ఈవెంట్ తాలూకు నిధులు దుర్వినియోగం అయ్యాయని గొడవలు రావడం వంటివి అమెరికాలో తెలుగు వారి నుండి రెస్పాన్స్ రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అసలు ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేసిన ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ వల్ల కూడా టిక్కెట్లు సరిగా అమ్ముడు పోలేదని తెలుస్తోంది. దీంతో మెహర్‌పై నమ్రత చాలానే సీరియస్ అయ్యారట. ఏది ఏమైనా మహేష్ లాంటి క్రేజీీ హీరో ఈ విధంగా జరగడం బాధాకరమే.