నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని భావించారు. తేజ డైరక్షన్ లో మొదలవ్వాల్సిన ఆ సినిమా కాస్త తేజ తప్పుకోగా క్రిష్ చేతుల్లోకి వచ్చింది. సినిమా మొదలైన నాటి నుండి ఏదో ఒక విధంగా అడ్డు తగలడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈమధ్య హరికృష్ణ మరణం ఎన్.టి.ఆర్ బయోపిక్ మరి కొంతకాలం బ్రేక్ తీసుకునేలా చేసింది.
ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ పాత్ర చాలా ఉంది. ఆయన చైతన్య రథానికి హరికృష్ణ సారధిగా ఉంటూ వచ్చారు. అంతేకాదు తండ్రి తర్వాత రాజకీయ వారసత్వం తీసుకునే అవకాశం ఉన్నా సరే కుటుంబ బాధ్యతలను మీద వేసుకున్న గొప్ప వ్యక్తి. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేసింది.
ఆయన మరణానికి ముందు హరికృష్ణ రోల్ లో కళ్యాణ్ రాంను అనుకోగా.. ఏదో మాములుగా ఆ పాత్ర రాసుకున్నారట. కాని ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారట. చైతన్య రధాన్ని ఆయన నడిపించిన తీరు అందుకు ఆయన పడిన కష్టం అంతా తెర మీద చూపిస్తున్నారట. ఇది ఓ రకంగా హరికృష్ణ గారికి ఓ నివాళిగా ప్రకటించే అవకాశం ఉంది.