సంచలనంగా మారిన సైరా పై సినిమా నిషేధం..?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి తెలుగుతో పాటుగా తమిళ, హింది, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
1

2
అయితే కన్నడలో ఈ సినిమాను నిషేధించేలా కార్యచరణలు చేస్తున్నారు. పెద్ద బడ్జెట్ తో వచ్చే సినిమాల వల్ల కన్నడలో చిన్న సినిమాలు బ్రతికే పరిస్థితి కనబడటం లేదు అందుకే వచ్చే ఏడాది నుండి కన్నడలో పెద్ద బడ్జెట్ సినిమాలు అక్కడ రిలీజ్ ఆపేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా సైరా, సాహోల మీద దెబ్బ పడబోతుందని తెలుస్తుంది.
3

5
ఎన్నాళ్ల నుండో కన్నడలో ఈ వాదన ఉండగా ఫైనల్ గా 2019 లో శాండల్ వుడ్ లో ఈ సినిమాల మీద నిషేధం వేస్తున్నారట. మరి ఇదే జరిగితే సైరాకు పెద్ద దెబ్బే అని అంటున్నారు.