ఒక మనిషి మరో మనిషి ద్వారా లబ్ధి పొందాలని భావిస్తే ఆ వ్యక్తి కోరే కోర్కెలను తీర్చడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే దీన్ని ప్రభుత్వ సంస్థలలో లంచం అంటారు. ఉద్యోగ ధర్మంగా చేయాల్సిన పనిని కాస్త లేటు చేసి పని జరిగాల్సిన వారి నుండి ఏదైనా ఆశించడం మాములైంది. ఎన్ని అవినీతి నిరోధక చట్టాలు వచ్చినా సరే వారిని ఏమి చేయలేకపోతున్నాయి.
కొత్తగా అవినీతి నిరోధక చట్టంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ అధికారి ఏవిధంగా అయినా సరే పని జరగాల్సిన వారి నుండి లబ్ధి పొందే అవకాశం ఉండకూడదు. ఈమధ్య కొన్ని చోట్ల లంచం రూపంలో మంచం మీద ఆసక్తి చూపుతున్న కొన్ని కేసులు తగిలాయి. అయితే అవినీతి నిరోధక చట్ట సవరణలో భాగంగా కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి.
వాటిలో లంచంగా మంచం కోరడం కూడా చట్టరీత్యా నేరమని తేల్చేశారు. ఎలాంటి లంచగొండి ఆలోచనలు లేకుండా ప్రభుత్వ అధికారులు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్ట చేస్తుంది. 2015,16 సవరణల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల మీద నిఘా ఎక్కువైంది. లంచం ఏ రూపాన్నైనా తీసుకున్నా సరే వారికి తగిన శిక్ష పడేలా చూస్తున్నారు.