Gossipsపెళ్లికూతురిపై అనుమానం.. పీటల మీద పెళ్లి ఆపిన వరుడు..!

పెళ్లికూతురిపై అనుమానం.. పీటల మీద పెళ్లి ఆపిన వరుడు..!

బాజా బజంత్రీలు.. పెళ్లి వేడుక.. ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు.. ఇక మరో గంటలో పెళ్లి అవుతుంది అనగానే సడెన్ గా ఏమైందో ఏమో పెళ్లికొడుకు పీటల మీద పెళ్లి వద్దంటూ పరుగెత్తాడు. అదేంటి అక్కడిదాకా వచ్చి పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే ఆ పెళ్లికూతురు మీద డౌట్ తోనే అని తెలుస్తుంది. ఈ సంఘటనతో కుటుంభ సభ్యులేకాదు బంధువులు షాక్ అయ్యారు.
4
తోట్లవళ్లూరులో పామర్రు మండలం నిభానిపూడి మండలానికి చెందిన నాగశ్రీను.. తోట వళ్లూరుకి చెందిన దివ్యతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్ధం జరుపుకున్న నాగశ్రీను, దివ్య మూడునెలలుగా ఆమె ప్రవర్తన చూసి అతనికి డౌట్ వచ్చిందట. పెళ్లి పీటల దాకా ఆగిన నాగ శ్రీ ఫైనల్ గా ఈ పెళ్లి తనకు వద్దని చెప్పి వెళ్లిపోయాడు.
3
అయితే వధువు తల్లి తండ్రులు బంధువులతో కలిసి తోట్లవళ్లూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారట. పెళ్లి ఇష్టం లేదని ముందే చెబితే బాగుండేది కాని పెళ్లి పీటల దాకా వచ్చి లేదని చెప్పడం మాత్రం షాక్ అని చెప్పొచ్చు.

2

1

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news