Gossipsఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఎన్.టి.ఆర్..?

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఎన్.టి.ఆర్..?

హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలీ ఒకట్టైందని చెప్పొచ్చు. ఇంతకుముందు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం ఉన్నా అన్న మరణంతో బాలకృష్ణ, తండ్రి మరణంతో ఎన్.టి.ఆర్ ఒకచోట చేరి ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అందరు కోరుకునే ఈ కలయిక ఈ సందర్భంలో వస్తుందని ఊహించలేదు.
5
అయితే బాలకృష్ణ ఎలాగు ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లను దగ్గరకు తీసుకున్నాడు కాబట్టి ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జూనియర్ కూడా నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ నటిస్తున్న అరవింద సమేత సినిమా ఆడియోకి బాలకృష్ణ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు.

అయితే గెస్ట్ గా రావడం పక్కన పెడితే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జూనియర్ నటిస్తే కనుక కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు పెరిగినట్టే. ఇప్పటికే యంగ్ ఎన్.టి.ఆర్ గా శర్వానంద్ ను అడిగితే కాదని చెప్పగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రోల్ లో ఎన్.టి.ఆర్ ను ఓకే చేస్తాడని అంటున్నారు. అదే జరిగితే ఎన్.టి.ఆర్ బయోపిక్ నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తున్న సినిమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది.

1

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news