తెలుగు సినిమాకు ఎంతోమంది దర్శకులను పరిచయం చేసిన అగ్ర నిర్మాత కె. రాఘవ ఈరోజు తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. తెలుగులో తొలి మూకీ సినిమా స్క్రిప్ట్ చదివే వ్యక్తికి సహాయకుడిగా సినిరంగంలోకి అడుగు పెట్టిన రాఘవ గారు దాసరి, కోడి రామకృష్ణ లాంటి ప్రముఖ దర్శకులను పరిచయం చేసి ఇండస్ట్రీకి ఏంటో మేలు చేశారు.
105 సంవత్సరాల కె. రాఘవ దాదాపు తన 95 ఏళ్లు సిని ప్రపంచంలోనే జీవించడం జరిగింది. నిర్మాత విలువని చెప్పేలా నిర్మాత అంటే డబ్బు పెట్టడం కాదు కథను నమ్మడం అనే సిద్ధాంతం గల గొప్ప వ్యక్తి కె. రాఘవ. అందుకే ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయన మృతి పట్ల సిని ప్రముఖులు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.