కేరళ వరద బీభత్సానికి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరద నీటితో అక్కడ జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇప్పటికే కేరళ వరద బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నా ఆ నష్టాన్ని పూరించాలంటే అందరం తలా ఒక చేయాల్సిందే అని మన పర బేధాలు లేకుండా ముందుకు కదులుతున్నారు. ఇక మరో పక్క ఈ వరదల వల్ల మత సామరస్యానికి కొత్త అర్ధం చెప్పిందని ఓ సంఘటన తెలియచేసింది.
ముసలమాన్ లు సాక్రిఫైజ్ డే గా కొలుకుచునే బ్రక్రీద్ రోజూ కేరళ వరద ప్రాంతంలో మసీదులు ఏవి లేకపోవడం వల్ల ఓ దేవాలయంలో వారి నమాజ్ చేసుకున్నారు. త్రిస్సుర్ లోని పురప్పిల్లికవు రక్తేశ్వరి టెంపుల్ లో ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. ముస్లీం సోదరుల అభ్యర్ధనను ఆహ్వానించి దేవాలయంలో నమాజ్ చేసేందుకు వీలు కల్పించారు. ఈ అరుదైన సంఘటన మత సామరస్వాన్ని పెంపొందిస్తుంది.
కేరళలో జరిగిన ఈ అరుదైన సంఘటన ప్రజల మనసులను మెప్పించింది. ఇప్పుడిప్పుడే వరదల నుండి కేరళ కోలుకుంటుంది. అయితే నష్ట నివారణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.