Movies24 కిస్సెస్ ట్రైలర్.. హెబ్భా పటేల్ ముద్దుల హంగామా..!

24 కిస్సెస్ ట్రైలర్.. హెబ్భా పటేల్ ముద్దుల హంగామా..!

కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హెబ్భా పటేల్ ఆ తర్వాత సినిమాలు చేస్తున్న అంత క్రేజ్ తెచ్చుకోలేదు. అందుకే ఈసారి మళ్లీ కుమారిని మించే సినిమాగా 24 కిస్సెస్ సినిమాతో వస్తుంది. ఈ సినిమాలో ఆదిత్ తో హెబ్భా పటేల్ ముద్దుల హంగామా మాములుగా లేదు.

టీజర్ తోనే సర్ ప్రైజ్ చేసిన హెబ్భా పటేల్ ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా లెక్క ఏంటో తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం ముద్దులతో ముంచెత్తేలా చేశారు. ఇక కథ విషయానికొస్తే హీరో ఓ ప్లే బాయ్ అమ్మాయిలను మోసం చేయడం అతనికి అలవాటు. అలాంటని చేతిలో హెబ్భా పడుతుంది. అందరిలానే ఆమెతో కూడా అ..ఆ..ఇ..ఈ కానిచ్చేస్తాడు.

అయితే అతని మోసాన్ని కనిపెట్టిన హెబ్భా అతనికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చింది అన్నది సినిమా కథ. అయోధ్యా కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టింది. మరి కుమార్ తర్వాత హెబ్భా బీభత్సం చేసిన ఈ 24 కిస్సెస్ ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news