కాస్త లేటుగా అయినా ఇప్పుడిప్పుడే క్రేజీ స్టార్ లిస్టు లో చేరిపోతోంది ముద్దుగుమ్మ లక్ష్మిరాయ్. కొంత కాలం పాటు హర్రర్ చిత్రాల్లో నటించి భయపెట్టిన ఈ స్లిమ్ బ్యూటీ ఆ తరువాత మాంచి కిక్కిచ్చే ఐటమ్స్ సాంగ్స్ తో ఫిలిం ఇండ్రస్ట్రీస్ ని ఒక ఊపుతోంది.
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరిర్ ని ప్రారంభించి ఐటెమ్ గర్ల్ గా పేరొందిన భామ రాయ్ లక్ష్మి. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టలేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికి పన్నిండేళ్లు దాటుతున్నా ఇప్పటికి ఆమె చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు చేసే పాత్ర మాత్రం నా కెరీర్ లో ది బెస్ట్ గా నిలవడమే కాకుండా అందరికి గుర్తుండి పోతుందని ఎంతో ధీమాగా చెప్తోంది లక్ష్మీ రాయ్.రోటిక్ డ్రామా గా తెరకెక్కిన జూలీ2లో అమ్మడి అందాలు ఏ రేంజ్ లో ఉన్నాయో సినిమా ని చూస్తేనే అర్ధమవుతోంది. మాలా షీనా’ అనే సాంగ్లో డ్యాన్స్ అదిరిపోయేలా చేసింది లక్ష్మి.
ఈ మధ్య లక్ష్మీరాయ్ ఒక మంచి సలహా ఇచ్చింది. సినిమా కోసం లిప్ కిస్ సీన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతోంది. లిప్ కిస్ చేసేముందు సిగరెట్ అలవాటు ఉంటే షూటింగ్ కి వచ్చే ముందు నోటిని శుభ్రంగా కడుక్కోవాలట. అంతే కాకుండా కుదిరితే చూయింగ్ గమ్ కూడా నోట్లో వేసుకోవాలని సలహా ఇస్తోంది. ఇక శరీరం నుంచి దుర్వాసన రాకూడదని చెప్తోంది. లిప్ కిస్ సీన్ చేసేటప్పుడు ఎంత మంది ఉన్నారనే విషయం గురించి అస్సలు ఆలోచించకూడదని అప్పుడే కొత్త హీరోయిన్స్ కి టిప్స్ ఇచ్చేస్తోంది ఈ అందాలరాశి.