Gossipsసైరా సెట్స్ లో బాలకృష్ణ సందడి..!

సైరా సెట్స్ లో బాలకృష్ణ సందడి..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ కు నందమూరి బాలకృష్ణ సడెన్ సర్ ప్రైజ్ అందరికి షాక్ ఇచ్చింది. చిరంజీవి సినిమా సెట్స్ కు బాలయ్య వచ్చాడట. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారట. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఒకరి సెట్స్ కు ఒకరు వెళ్లడం ఫ్యాన్స్ కు మంచి సదేశం ఇస్తున్నట్టే లెక్క.
1

2
ఓ పక్క ఇరు వర్గాల ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే బాలకృష్ణ సైరా సెట్స్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఖచ్చితంగా ఈ కలయిక ఎన్నో మార్పులకు దారి తీస్తుందని చెప్పొచ్చు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో ఆ సినిమా తెరకెక్కుతుంది. సైరాని మాత్రం సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.
6

5
ఇక చిరు, బాలయ్యలలు కలిసిన పిక్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఫోటోలు రాకున్నా ఈ ఇద్దరు కలిశారన్నది మాత్రం అఫిషియల్ న్యూసే. ఓ పక్క చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ కు రెడీ అవుతుంటే బాలయ్య స్వయంగా వెళ్లి సైరా సెట్స్ లో చిరుని కలవడం మెగా నందమూరి ఫ్యాన్స్ అంతా సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు.4

3

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news