సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన అమలా పాల్ తమిళ దర్శకుడి విజయ్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవల కారణంతో విడిపోయారు. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది అమలా పాల్. కన్నడలో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న అమలా పాల్ ఓ సినిమా షూటింగ్ టైంలో గాయాలపాలయ్యిందట.
సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సంఘటన జరిగిందట. ఓ యాక్షన్ సీన్ లో భాగంగా అమలా మోచేతికి దెబ్బ తగిలిందట. డాక్టర్ సలహా మేరకు అది రికవరీ అయ్యేదాకా ఎలాంటి రిస్క్ లు చేయొద్ధని చెప్పారట. అలా అమలా షూటింగ్ కు బ్రేక్ వేయడం జరిగింది. అమలా ఫ్యాన్స్ మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
https://youtu.be/GM_k4crXgzc