Gossipsఅరవింద దెబ్బకు షేక్ అవుతున్న యూట్యూబ్..

అరవింద దెబ్బకు షేక్ అవుతున్న యూట్యూబ్..

యంగ్ టైగర్ స్టామిన ఏంటో నిన్న రిలీజ్ అయిన అరవింద సమేత వీర రాఘవ టీజర్ చూపిస్తుంది. రికార్డుల లెక్క తేల్చనిదే నిద్రపోని తారక రాముడు టీజర్ తోనే తన తోడి స్టార్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు. అరవింద సమేత వీర రాఘవ టీజర్ నిన్న ఉదయం 9 గంటలకు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ఎలా ఉంది అన్నది నిన్న అంతర్జాలంలో హంగామా చూస్తే తెలుస్తుంది.

కేవలం 24 గంటల్లో 60 లక్షల డిజిటల్ వ్యూస్ తో వీర రాఘవ విధ్వంస సృష్టిస్తున్నాడు. టీజర్ లో కంటపడ్డవా కనికరిస్తానేమో.. అనే డైలాగ్ నే మార్చి తన రికార్డుల వెంట పడితే వేటాడేందుకు రెడీ అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. త్రివిక్రం మార్క్ మూవీగా అరవింద సమేత సంచలనాలు సృష్టించడం ఖాయం అని నిన్న టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తుండగా అక్టోబర్ 11న ఈ సినిమారిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news