అక్కినేని కోడలిగా మారినా తర్వాత సమంతకు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంత చైతుని పెళ్లాడటం వల్ల అతని ఇమేజ్ కూడా పెరిగింది. అంతేకాదు సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా అక్కినేని ఫ్యామిలీ మాత్రం సమంతను వాడేయడం కామన్ గా మారింది. రాజు గారి గది-2 నుండి రాబోతున్న చిలసౌ వరకు అక్కినేని ఫ్యామిలీ సినిమా అంటే చాలు సమంత ప్రమోట్ చేయాల్సిందే.
రాజు గారి గది-2 లో సమంత నటించింది కాబట్టి ఆమె ప్రమోట్ చేసిందని చెప్పొచ్చు. కాని చిలసౌ సుశాంత్ కు సపోర్ట్ గా నిలవడం మాత్రం సమంత క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే అంటున్నారు. తన ఫ్యామిలీ హీరో కాబట్టి సుశాంత్ సినిమాకు అటు చైతు, ఇటు సమంత ఫుల్ ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవింద్రన్ కూడా తన స్నేహితురాలు చిన్మయి భర్త కావడంతో సమంత ఈ విధంగా కూడా చిలసౌ ప్రమోషన్స్ ను న్యాయం చేస్తుంది.
మొత్తానికి సమంతను ఈ రేంజ్ లో వాడుకోవడం కొందరు సమంత ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. ఇక ఈమధ్య అమ్మడు సినిమాలు మానేసి ఉత్తమ ఇల్లాలిగా మారాలని చూస్తుంది. అలా చేస్తే సమంత ఫ్యాన్స్ కచ్చితంగా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది.