బాహుబలి తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడన్న ప్రేక్షకుల అంచనాలకు కూడా అందకుండా మెగా నందమూరి మల్టీస్టారర్ కు సిద్ధమయ్యాడు మన జక్కన్న. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేయబోతున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ముందు 150 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమాకు 300 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కథ ఓ పిరియాడికల్ సబ్జెక్ట్ అంటూ వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తాడని అంటున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తరహాలోనే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మన్యం పులిగా నటించబోతున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే అల్లూరిగా తారక్ చేస్తే మాత్రం అది బాహుబలి కాదు ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం.