Movies" తేజ్ ఐలవ్యూ " ట్రైలర్.. కరుణాకరణ్ మార్క్ లవ్ స్టోరీ..!

” తేజ్ ఐలవ్యూ ” ట్రైలర్.. కరుణాకరణ్ మార్క్ లవ్ స్టోరీ..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న మూవీ తేజ్ ఐలవ్యూ. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మించారు. అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందించాడు.

లవ్ స్టోరీస్ ఎన్నొచ్చినా తొలిప్రేమని మించి ఏ ప్రేమకథ ఉండదని తెలుగు ప్రేక్షకుల భావన. ఆ తొలిప్రేమ దర్శకుడు అదే ఫ్యామిలీ హీరోతో చేసిన మరో లవ్ స్టోరీ తేజ్ ఐలవ్యూ మూవీ. సినిమాలో సాయి ధరం తేజ్, అనుపమ క్యూట్ లవర్స్ గా కనిపిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమ మళ్లీ కరుణాకరణ్ డైరక్షన్ టాలెంట్ ను చూపిస్తుందని తెలుస్తుంది.

తేజూ కూడా ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. జూలై 6న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పోటీగా గోపిచంద్ పంతం వస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news