Gossipsబిగ్ బాస్-2 రిలీజ్ కి ముందే వివాదం.. మహిళా సంఘాలు సీరియస్..!

బిగ్ బాస్-2 రిలీజ్ కి ముందే వివాదం.. మహిళా సంఘాలు సీరియస్..!

స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 రేపటి నుండి ప్రసారం కాబోతుంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రియాలిటీ షో ప్రోమోస్ తో సందడి చేస్తుండగా బుల్లితెర ప్రేక్షకులు దీని గురించి ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

రేపు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్-2 షోపై మహిళా సంఘాలు నిరసనకు దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మొదటి సీజన్ లోనే హౌజ్ లో ఉన్న మహిళలు మసాజులు చేయించుకోవడం కాస్త బుల్లితెరను హీటెక్కించాయి. అయితే దీనిపై అప్పుడే మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. రాబోతున్న ఈ సీజన్-2లో ఇలాంటివి జరుగకుండా చూడాలని వారు హెచ్చరిస్తున్నారట.

అయితే నాని మాత్రం బిగ్ బాస్-2 ఈసారి మరింత మసాలా అంటూ ముందే చెప్పాడు. కచ్చితంగా ఈ సీజన్ లో వివాదాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. మరి అసలు కంటెస్టంట్స్ ఎవరు.. ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది లాంటివన్ని మరో 24 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news