Gossipsకాలా 2 డేస్ కలక్షన్స్..! కరికాలుడి విధ్వంసం..

కాలా 2 డేస్ కలక్షన్స్..! కరికాలుడి విధ్వంసం..

కబాలి తర్వాత రంజిత్, రజినికాంత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కాలా. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో మొదటి రోజు 15.9 కోట్లు వసూళు చేయగా రెండో రోజు 10.5 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో 650 సెంటర్స్ లో రిలీజ్ అయిన కాలా మొదటి రెండు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది.

అయితే ఈ సినిమా తెలుగులో 30 కోట్లకు కొన్నారు. ఇక్కడ కలక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదటి రోజైతే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. కబాలి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అయితే ఆ సినిమా వేసిన దెబ్బ కాలా మీద బాగా పడ్డది.

కాలా 2 డేస్ టోటల్ కలక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. కబాలితో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్ అన్నట్టే ఉన్నా కలక్షన్స్ మాత్రం కబాలికి తక్కువగా ఉండటం విశేషం. మరి కాలా అయినా రజిని ఖాతాలో హిట్ సినిమా అవుతుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news