మహానటి సావిత్రి బయో పిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. మూస పద్దతి సినిమాలకి విరుద్ధంగా ఎంచుకున్న కథాంశం .. దానిని నడిపించిన విధానం అటు సినీ ప్రముఖులనుండి ఇటు సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ ఆ సినిమా దర్శక నిర్మాతలను వేనోళ్ళ పొగుడుతూనే ఉన్నారు. నందమూరి తారక రామారావు బయోపిక్ కూడా బాలకృష్ణ తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఎవరి బయోపిక్ తీస్తే ప్రేక్షకులని ఆకట్టుకోగలము అనుకుంటూ సినీ పక్షులు సినీ తారల జీవితాల్లోకి తరచి తరచి చూస్తున్నారు ఇప్పుడు. ఇక ఒక జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని తమ హీరో బయో పిక్ తీయాలంటూ.. తన కథని మాకు పంపడం జరిగింది. అతని అభ్యర్ధన మేరకు సూక్ష్మంగా ఆ కథలోని కొన్ని అంశాలను మా వీక్షకుల కోసం ఇక్కడ ఇస్తున్నాము.
కథ-కథనం : జూనియర్ ఎన్టీఆర్ జననం , చిన్నతనం లోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు , కూచిపూడి నేర్చుకున్న విధానం , తాత గారి దగ్గరికి చేరిక , ఒక బాల రామాయణం ..అంతలోనే తాత గారి దుర్మరణం , నిన్ను చూడాలని సినిమా తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ ,ఆది సినిమాలు తెచ్చిన ఇమేజ్ , సింహాద్రి తో బ్లాక్ బస్టర్ విజయం ..వెను వెంటనే సరైన గైడెన్స్ లేక పరాజయాలు , హెవీ వెయిట్ సమస్య , కొందరి సలహాతో అంకిత భావంతో బరువు తగ్గి కొన్ని సినిమాల విజయాలు ..నందమూరి కుటుంబం దగ్గరికి చేరడం , ప్రణతి తో పెళ్లి , 2009 లో తెలుగుదేశం తరపున ప్రచారం , ఆక్సిడెంట్ తెచ్చిన మార్పు, తెలుగు దేశం మరియు నందమూరి కుటుంబం మరలా దూరం , మరలా సినిమాల పరాజయాలు , కళ్యాణ్ రామ్ అన్నయ్యకి బాగా దగ్గర కావటం , మొదటి సంతానం పుట్టుక , కొడుకు పుట్టిన తరువాత వచ్చిన మార్పులతో తనని తాను మార్చుకున్న విధానం ,సినిమాల ఎంపిక , నందమూరి అభిమానుల కోసం మాత్రమే కాక.. అందరికోసం తన సినిమాలు ఉండాలంటూ ప్రతి సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ, తనని తాను మార్చుకుంటూ .. విజయాల బాట పట్టడం , బిగ్ బాస్ అవకాశాన్ని వినియోగించుకుని అందరినోట మన్ననలు పొందటం , తన తోటి హీరోలతో ఎంతో సఖ్యంగా ఉంటూ యునైటెడ్ టాలీవుడ్ కి తనవంతుగా ముందుగా అడుగులు వేయడం.. #RRR సినిమాతో ఇండియన్ ఫిలిం రికార్డులని తిరగ రాయటం (ఫ్యూచర్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు మరొక స్టార్ హీరో చూసి ఉండడు. సినిమాల విషయంలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా తాను ఎన్నో సవాళ్ళను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. పరాజయాలనుండి తనని తాను నిర్మించుకుంటున్న విధానం ఇప్పటి యువతకి మార్గ దర్శకంగా ఉండేలా తన బయో పిక్ ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు సదరు వీరాభిమాని.
నోట్ : ఈ కథాంశంలో మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనిపిస్తే క్రింద కామెంట్ చేయగలరు.