మాస్ మహరాజ్ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా నేల టిక్కెట్టు. రిలీజ్ అయిన మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ 3 డేస్ లో 8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ఇందులో మొదటిరోజు షేర్ వాల్యూనే ఎక్కువ ఉండటం విశేషం. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల హిట్లతో కళ్యాణ్ కృష్ణ చేసిన ఈ నేల టిక్కెట్టు అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
ఇక ఈ సినిమా మూడు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 6.77 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇందులో 3.49 కోట్లు మొదటి రోజు కలక్షన్స్ అవడం విశేషం. రవితేజ మార్క్ మూవీ అందివ్వడంలో విఫలమైన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా ఫ్లాప్ తాలూఖా అపవాదాలన్ని మోస్తున్నాడు.
ఏరియాల వారిగా నేల టిక్కెట్టు 3 డేస్ కలక్షన్స్ చూస్తే..
నైజాం 2.40 కోట్లు
సీడెడ్ 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర 0.90 కోట్లు
కృష్ణా 0.46 కోట్లు
గుంటూరు 0.63 కోట్లు
ఈస్ట్ 0.63 కోట్లు
వెస్ట్ 0.42 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15
ఓవర్సీస్ 0.20 కోట్లు
వరల్డ్ వైడ్ 8 కోట్లు
సినిమా వరల్డ్ వైడ్ గా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. మూడు రోజుల్లో 8 కోట్లు రాబట్టగలిగింది. ఇంకా 14 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంది. చూస్తుంటే ఈ సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు నిరాశ మిగిల్చేలా ఉంది.