బాహుబలి 2 తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా #RRR గురించి అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అందునా మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏమైనా ప్రకటన చేస్తారేమోనని ఎంతో ఆసక్తి గా ఎదురుచూశారు అభిమానులు. కానీ వారికి నిరాశే ఎదురైంది. అయితే రామ్ చరణ్ కానీ , ఎన్టీఆర్ కానీ ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పటం లేదు. ఇంకా కథ పూర్తిగా తయారు కాలేదని మాత్రం తెలుస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే రామ్ చరణ్ పాత్ర పోలీస్ అని ఫిలిం నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. సీఐ పాత్రలో రామ్ చరణ్ చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే తన కెరీర్ లో పోలీస్ పాత్రలో రెండు సార్లు చేసిన రామ్ చరణ్ మరి ఈ సినిమా కోసం మరలా ఆ పాత్రే చేయబోతున్నాడా లేదా అన్నది కొన్ని రోజులు ఆగితే కానీ చెప్పలేము. ఇక చరణ్ పోలీస్ అయితే మరి ఎన్టీఆర్ ఖచ్చితంగా ఏ డిటెక్టివ్ లేక మంచి దొంగ తరహా పాత్ర కానీ అయ్యి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కాంబినేషన్ క్రియేట్ చేయబోయే సంచలనాలు తలచుకొంటుంటేనే అదోరకమైన అనుభూతి కలుగుతుంది.