Gossipsటాలీవుడ్ లో మరో విషాదం శోకసముద్రంలో సినీ పరిశ్రమ..!

టాలీవుడ్ లో మరో విషాదం శోకసముద్రంలో సినీ పరిశ్రమ..!

తెలుగు, తమిళ, హింది భాషల్లో దాదాపు 67కు పైగా సినిమాలు చేసిన ప్రముఖ నిర్మాత ముక్తా శ్రీనివాసన్ (90) మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శ్రీనివాసన్ నిర్మించిన నాయకన్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ సినిమా అని చెప్పొచ్చు. కమ్యూనిష్టు ఉద్యమనేతగా జీవితం ప్రారంభించిన శ్రీనివాస్ ముక్తా సినిమాస్ బ్యానర్ లో తమిళంలో ముందు సినిమా నిర్మాణం మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు, హిందీ బాషల్లో కూడా సినిమాలు తీయడం జరిగిందట.

కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శ్రీనివాసన్ మంగళవారం రాత్రి 10 గంటల ఆ సమయంలో అనంతలోకాలకు వెళ్లారని తెల్లుస్తుంది. ముక్తా శ్రీనివాసన్ నిర్మాణ సంస్థలో శివాజి గణేషన్, జెమిని గణేషన్, జైశంకర్, రజినికాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల రజినికాంత్, కమల్ హాసన్, మణిరత్నం ఇంకా కొందరు సిని ప్రముఖులు తన ప్రగాడ సంతాపం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news