దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత మెగా నందమూరి సినిమా ప్లాన్ చేశాడని తెలిసిందే. భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుండి మొదలవుతుందని ముందే చెప్పారు. రంగస్థలం తర్వాత బోయపాటి సినిమాకు సిద్ధమైన చరణ్ ఆ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు.
ఇక తారక్ త్రివిక్రం సినిమా మార్చి నుండి మొదలు పెడతారట. అయితే తారక్ కాస్త లేట్ గా రాజమౌళి సినిమాలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రాజమౌళి ముందు చరణ్ తోనే సినిమా మొదలు పెడతాడట. ఆ తర్వాత తారక్ వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతాడట. సినిమాలో ఇద్దరు స్టార్స్ కు సమానమైన రోల్స్ ఇచ్చారట.
విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే సినిమా కథ సిద్ధం చేయగా.. ఫైనల్ వర్షన్ పై చర్చలు చేస్తున్నారట. మొత్తానికి రాజమౌళి సినిమా అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అంచనాలు పెంచుకునేలా రాబోతుందని చెప్పొచ్చు.