Gossipsఅజ్ఞాతవాసిని పాతాళానికి తొక్కిపడేసిన జై సింహ !!

అజ్ఞాతవాసిని పాతాళానికి తొక్కిపడేసిన జై సింహ !!

పవర్ స్టార్ వర్సెస్ నందమూరి నటసింహం.. సంక్రాంతికి జరిగిన ఈ బాక్సాఫీస్ ఫైట్ లో చివరగా నందమూరి సింహం నటించిన జై సింహాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన జై సింహా బాలయ్య సత్తా చాటేలా చేసింది. ఇక దీనికి పోటీగా వచ్చిన పవన్ కళ్యాణ్ త్రివిక్రం కలిసి చేసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అవడంతో జై సింహాకు బాగా కలిసి వచ్చింది.

అజ్ఞాతవాసి మొదటి రెండు రోజులు కలక్షన్స్ బాగా వచ్చినా సీడెడ్ లో మాత్రం అజ్ఞాతవాసి కలక్షన్స్ బీట్ చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు బాలయ్య బాబు. అజ్ఞాతవాసి సీడెడ్ లో 5.3 కోట్లను వసూళు చేయగా.. జై సింహా 5.8 కోట్లతో దూసుకెళ్తుంది. 6 కోట్ల దాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సి.కళ్యాణ్ నిర్మించిన ఈ జై సింహా తొలి వారాంతరంలోనే లాభాల్లోకి వెళ్లింది. సినిమా తీసిన దర్శక నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్స్ అంతా సినిమా వల్ల మంచి లాభం పొందారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news