నందమూరి బాలకృష్ణ సినిమాల్లో సీడెడ్ లో ఉన్న రేంజ్ వేరు.. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు అక్కడ సంచలన రికార్డులు సృష్టించాయి. ఇక సంక్రాంతి కానుకగా జై సింహాగా వచ్చిన బాలయ్య సీడెడ్ లో గర్జించాడు. ఏకంగా బిజినెస్ చేసిన దాని కన్నా బీభత్సమైన కలక్షన్స్ సాధించాడు. వారంలో 5 కోట్ల కలక్షన్స్ తో సీడెడ్ లో సిం హం సత్తా చాటింది.
అయితే నైజాంలో మాత్రం బాలయ్యకు దెబ్బే పడింది. వారంలో కేవలం 3.85 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది జై సింహా. హైదరాబాద్ సిటీ లాంటి ఏరియాతో కలుపుని ఇంత తక్కువ కలక్షన్స్ సాధించడం ఆశ్చర్యంగానే ఉంది. ఆంధ్రాలో కూడా జై సింహా వసూళ్లు బాగానే ఉన్నాయి. కేవలం ఉత్తరాంధ్రలోనే 2.88 కోట్లు కలెక్ట్ చేయగా మిగతా ఏరియాలు కలిసి 9 కోట్లు వసూళు చేసింది.
తెలుగు రెండు రాష్ట్రాల్లో 20.5 కోట్లు వసూళు చేయగా.. వరల్డ్ వైడ్ గా 23.3 కోట్లు కలక్షన్స్ వచ్చాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్లు చేసింది. మరో 3 నుండి 4 కోట్లు రాబట్టగలిగితే జై సింహా హిట్ అన్నట్టు లెక్కే.http://www.telugulives.com/telugu/ntr-trivikram-new-update/