Gossipsకొన్ని గంటల్లో మెగా ఫ్యాన్స్ కు సర్ పైజ్..!

కొన్ని గంటల్లో మెగా ఫ్యాన్స్ కు సర్ పైజ్..!

ఫిదా సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా తొలిప్రేమ. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ అవనున్న ఈ సినిమా ఆడియో మరికొద్ది గంటల్లో రిలీజ్ అవనుంది. ఈ సినిమాకు తమన్ క్రేజీ ట్యూన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన మొదటి పాట సూపర్ హిట్ అయ్యింది.

ఇక మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేలా ఈ ఆడియోలో మెగా ఫ్యామిలీ హీరోలు పాల్గొనబోతున్నారని టాక్. మెగాస్టార్ తో పాటుగా నాగ బాబు కూడా ఈ ఆడియో ఈవెంట్ లో పాల్గొంటారట. అయితే పవర్ స్టార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాట. బివిఎస్సెన్ ప్రసాద్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చాయి. ఆ చనువుతో పవన్ ఈ ఆడియోకి వస్తాడని అంటున్నారు.

మొత్తానికి వరుణ్ తేజ్ తొలిప్రేమ ఈవెంట్ మెగా ఈవెంట్ గా జరుగనుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ మూవీ అయిన తొలిప్రేమ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెబుతున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాగా నటించాడని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news